కారు కొనే వారికి షాక్..?
07-09-2026 | 01:44pm
దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ(Maruti Suzuki) ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచింది. ముడిసరుకుల వ్యయం, ద్రవ్యోల్బణం పెరగడంతో గరిష్ఠంగా రూ.20 వేల వరకు ధరలు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. కొత్త ధరలు ఈ నెల నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే ఏ మోడళ్లపై ఎంత పెంపు ఉంటుందన్న వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. గత ఆగస్టులోనూ మారుతీ పలు మోడళ్ల ధరలను పెంచింది.
