7 September, 2026 | 10:21 AM

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

07-09-2026 | 08:36am

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు సభ సమావేశాలు ప్రారంభమవుతాయి. సభ ప్రారంభంలోనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగనుంది. సభ ముందుకు మూడు కీలక నివేదికలు రానున్నాయి. TSS 2024-25 ఆడిట్ నివేదికను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టనున్నారు.

అలాగే PM SHRI 2024-25 ఆడిట్ నివేదిక కూడా సభ ముందుకు రానుంది. హైదరాబాద్ మెట్రోకు సంబంధించిన ఐదు వార్షిక నివేదికలను కూడా సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నివేదికలను ముఖ్యమంత్రి సభ ముందుకు తీసుకురానున్నారు.కంపెనీల చట్టంలోని సెక్షన్ 395 ప్రకారం ఈ నివేదికలను అసెంబ్లీలో సమర్పించనున్నారు.

మరిన్ని వార్తలు