19 August, 2026 | 2:13 PM

ఎస్ఆర్ఆర్ కు మినివాటర్ కూలర్ వితరణ

19-08-2026 01:18 PM

ముకరంపుర, ఆగస్టు 19(విజయక్రాంతి): ఎస్ఆర్ఆర్ కళాశాలకు చెందిన ఎం కాం 2024-26 బ్యాచ్ కు చెందిన విద్యార్థులు మినీ వాటర్ కూలర్ ను కామర్స్ విభాగానికి వితరణ చేశారు. ఇటీవల 2024-26 బ్యాచ్ కు చెందిన ఎం కాం విద్యార్థులు తమ కోర్స్ పూర్తి చేసుకుని బయటకు వెళ్తున్న సందర్భంలో తాము విద్య నేర్చుకున్న సంస్థకు ఏదైనా తిరిగి ఇవ్వాలనే సంకల్పంతో  బ్లూ స్టార్ మినీ వాటర్ కూలర్ ను కళాశాల వైస్ ప్రిన్సిపల్ మరియు కామర్స్ విభాగాధిపతి టి రాజయ్యకు కామర్స్ అధ్యాపకుల సమక్షంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మినీ వాటర్ కూలర్ ను అందజేసిన ఎం కాం విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కల్వకుంట రామకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ నితిన్ పాఠక్, టిజీసీజీటీఏ అధ్యక్షులు మరియు ఉన్నత విద్య ఐకాస చైర్మన్ డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి మరియు అధ్యాపకులు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.