జమిందార్ అయితే 2004లో KCR ఎందుకు చూపలేదు!

18-09-2026 | 12:57pm

హరీశ్ రావు చేసింది పక్కా మోసం

హరీశ్ రావు భూమిలో ఇందిరమ్మ టవర్స్ కడతాం

అన్ని ఆధారాలతో అన్నీ బయటపెడతాం

ఓవర్ లాప్ ల్యాండ్ లో కేసీఆర్ తిష్ఠ.. పొంగులేటి చిట్ చాట్

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)కు సంబంధించిన భూముల వివరాలపై రెవెన్యూ శాఖ అధికారులు(Revenue Department officials)రెవెన్యూ శాఖ అధికారులు) కసరత్తు మొదలుపెట్టారు. ఫామ్ హౌస్ పరిసరాల్లో ప్రభుత్వ భూముల వివరాలను సేకరిస్తున్నారు. సర్వే నంబర్ 325లోని 388 ఎకరాల భూములపై అధికారులు ఆరా తీస్తున్నారు. 325 సర్వే నంబర్ లో ఎన్ని ఎకరాల భూమి ఉందని అధికారులు శాటిలైట్ సర్వే చేస్తున్నారు. సర్వే నంబర్లు, గతంలో ఉన్న రైతుల పేర్లు, తదితర వివరాలు సైతం సేకరిస్తున్నారు. ఈ అంశంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్(Minister Ponguleti Srinivas) మీడియాతో మాట్లాడుతూ.... ఓవర్ లాప్ ల్యాండ్(Overlapping land)లో కేసీఆర్ తిష్ఠవేశారని తెలిపారు.

చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇబ్బంది లేదన్న మంత్రి సర్వే చేసి ఎక్కువ తక్కువ ఉంటే కేసీఆర్ కు నోటీసులు పంపుతామన్నారు. ఒరిజినల్ జమిందార్ అయితే 2004లో KCR ఎందుకు చూపలేదన్న ఆయన ఒక ఎకరం ఉందని మాత్రమే చూచించారని చెప్పారు. కేసీఆర్ భూమిలో(KCR lands) ప్రభుత్వ భూమి ఉన్నట్లు సమాచారం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమి అని తేలితే ఎస్సీలకు పంచుతామని సూచించారు. సర్వే తర్వాత సాంకేతిక ఆధారాలతో అన్నీ బయటపెడతామన్నారు. ఎస్సీలు ఫామ్ హౌస్ కు వెళ్తే పసుపు నీళ్లు చల్లారని ఆరోపించారు. అలాంటివారికి ఎస్సీలపై ప్రేమ ఏం ఉంటుందని విమర్శించారు.

భూ సర్వేలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని సూచించారు. చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. హరీశ్ రావు చేసింది పక్కా మోసమని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.  వాళ్ల మామ కొన్నట్లు చెబుతున్న డాక్యుమెంట్లు బోగస్ అన్నారు. రంగనాయక్ సాగర్(Ranganayak Sagar) దగ్గర హరీశ్ రావు భూ దోపిడీ చేశారని పొంగులేటి సంచలన వ్యాఖ్యల చేశారు. హరీశ్ రావు(Harish Rao) దోచుకున్న భూమిలో ఇందిరమ్మ టవర్స్ కడతామని చెప్పారు. నా ప్రాజెక్టులకు అనుమతించింది గత ప్రభుత్వమే.. హోల్డ్  చేసింది ఆ ప్రభుత్వమేనని ఆరోపించారు. రాజకీయాల్లోకి రాకముందే వ్యాపారంలో ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. డిఫెన్స్ లో గ్రోత్ ఉంది కాబట్టి ఆ రంగంలోకి వెళ్లామన్న మంత్రి పొంగులేటి సీఎం సోదరులు అయితే వ్యాపారం చేయొద్దా?అని మంత్రి పొంగులేటి బీఆర్ఎస్ ను ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు