రైతుల పక్షాన మంత్రి

24-09-2026 | 05:16pm

కూసుమంచి, సెప్టెంబర్ 24(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని(Minister Ponguleti Srinivasa Reddy), ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డిని హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులకు జొన్నలగడ్డ రవికుమార్ కూసుమంచి మండల మాజీ  ఎంపీపీ జూకూరి గోపాలరావు మర్యాద పూర్వకంగా కలిశారు.

ఇటీవల పాలేరు నియోజకవర్గ రైతుల పంటలను కాపాడేందుకు పాలేరు పాత కాల్వకు నీటిని విడుదల చేయడంతో పాటు, భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా కూసుమంచి మండలంలోని వివిధ గ్రామాల చెరువులకు నీటిని విడుదల చేసి, క్లిష్ట సమయంలో రైతులకు అండగా నిలిచి పంటలను రక్షించినందుకు రైతుల తరఫున హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు