మోదీజీ మహా మానవుడు

19-09-2026 | 05:05am
  1. పేదల సంక్షేమం, దేశ అభ్యున్నతికి నిరంతర కృషి
  2. ఆధ్యాత్మికవేత్త స్వామి అభిషేక్ బ్రహ్మచారి  
  3. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నాగోల్‌లో మహాయజ్ఞం 

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) మహా మానవుడని.. పేద వర్గాల సంక్షేమం, దేశ అభ్యున్నతి కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి అభిషేక్ బ్రహ్మచారి(Swami Abhishek Brahmachari) కొనియాడారు. మోదీ నాయకత్వంలో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ అన్ని రంగాల్లో పెరిగిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ జన్మదినాన్ని(Birthday) పురస్కరించుకుని దేశ ప్రగతి, విశ్వశాంతి(World Peace), పేదల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ శుక్రవారం హైదరాబాద్(Hyderabad) నాగోల్‌లోని జైపూర్ కాలనీలో స్వామి అభిషేక్ బ్రహ్మచాతరి ఆధ్వర్యంలో శ్రీ విద్య దశకోటి కుంకుమార్చన మహాయజ్ఞం(Sri Vidya Dashakoti Kumkumarchana Maha Yajna) ఘనంగా నిర్వహించారు.

వారణాసి నుంచి వచ్చిన వేద పండితులు గణేశ పూజ, శ్రీ లలితా మాత పూజతో యజ్ఞాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి అభిషేక్ బ్రహ్మచారి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు మోదీ బలమైన నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నారని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, నూతన విద్యా విధానం వంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టారని వివరించారు.

యువ చేతన జాతీయ కన్వీనర్ రోహిత్ కుమార్‌సింగ్ మాట్లాడుతూ.. మోదీ నేతృత్వంలో దేశంలోని సామాన్య యువత అభివృద్ధికి భరోసా ఏర్పడిందన్నారు. 2047కు ముందే భారత్‌ను విశ్వగురువుగా నిలపాలన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. మహాయజ్ఞంలో 11వేల మందికి పైగా మహిళలు పాల్గొని శ్రీ లలితా సహస్రనామాన్ని 10 కోట్ల సార్లు పారాయణం చేస్తూ అమ్మవారికి కుంకుమార్చన చేశారు.

ఈ కార్యక్రమంలో విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం(Vijayakranti Daily Chairman CL Rajam), మేనేజింగ్ డైరెక్టర్, యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి సభ్యురాలు విజయరాజం, సుధాకర్ శర్మ, శ్రీదేవి, అనంతలక్ష్మి, కరాటే కల్యాణి, అభిజిత్ రెడ్డి, జితేంద్రరావు, సమితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు