కోతుల బెడద.. బాలుడికి గాయాలు!

19-09-2026 | 05:05am
  1. బూర్గంపాడు మండలంలో పెరుగుతున్న కోతులు, వీధికుక్కలు
  2. చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటేనే జంకుతున్న వైనం

బూర్గంపాడు, సెప్టెంబర్18 (విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలోని గ్రామాల్లో కోతులు, వీధికుక్కల(Monkeys, stray dogs) బెడద రోజురోజుకూ పెరుగుతోంది. ఇళ్ల పరిసరాలు(Surroundings of houses), వీధులు, రహదారుల(streets, and roads)పై కోతుల గుంపులు సంచరిస్తుండగా.. కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయి. దీంతో చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

బాలుడిపై దాడి.. ఆందోళన

తాళ్లగొమ్మూరు గ్రామానికి చెందిన పరిటాల గణేష్(Paritala Ganesh) అనే బాలుడిపై ఇటీవల కోతులు దాడి చేసి గాయపరిచిన ఘటనతో స్థానికుల్లో ఆందోళన మరింత పెరిగింది. జనావాసాల్లోకి తరచూ వస్తున్న కోతులు ఎప్పుడు దాడి చేస్తాయోనని ప్రజలు భయపడుతున్నారు. పిల్లలను ఒంటరిగా బయటకు పంపేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు.

కుక్కల బెడదా ఎక్కువే

కోతులతోపాటు వీధికుక్కల సంఖ్య కూడా పెరుగుతోందని గ్రామస్థులు చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో గుంపులుగా సంచరిస్తూ పాదచారులు, ద్విచక్రవాహనదారులను వెంటాడుతున్నాయని పేర్కొంటున్నారు. దీంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదం జరిగాకే స్పందిస్తారా?

బాలుడిపై కోతుల దాడి నేపథ్యంలోనైనా అధికారులు స్పందించాలని గ్రామ స్థులు కోరుతున్నారు. గ్రామపంచాయతీ అధికారులు ప్రత్యేకంగా పర్యటించి కోతులు, వీధికుక్కల సమస్యను గుర్తించి సంబంధిత శాఖల సహకారంతో నియంత్రణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరిన్ని ఘటనలు చోటుచేసుకోకముందే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు