ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు
ములకలపల్లి, అక్టోబర్ 2 (విజయక్రాంతి): ములకలపల్లిలో శుక్రవారం గాంధీ జయంతి(Gandhi Jayanti) వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ కొరస చంద్రలేఖ, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు కొదుమూరి గోపాల్,ఉప సర్పంచ్ పువ్వాల లలితారావు, ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ములకలపల్లి బస్టాండ్ సెంటర్‌ను ఎంజీ రోడ్ గా నామకరణం చేయాలని ప్రతిపాదించారు.
ఇందుకు సంబంధించి స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ సెక్రెటరీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ద్వారా తక్షణమే తీర్మానం చేయాలని కోరారు. సత్యం,అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో బ్రిటిష్ పాలకులను గడగడలాడించి దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయుడు గాంధీజీ అని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నాయకులు బండి కొమరయ్య, శనగపాటి సీతారాములు, డాక్టర్ గోపి, కరుటూరి కృష్ణ, బిక్కుమళ్ళ వేణు, శనగపాటి సుదర్శన్, మేడిశెట్టి సూరయ్య, స్థానిక వార్డ్ సభ్యులు వెంకటమ్మ,ముదిగొండ శ్రీను, శనగపాటి రవి, కోడుమూరి నాగయ్య, ఓబులశెట్టి ప్రభాకర్, బిక్కుమల్ల సుధాకర్, నరాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.