ప్రభుత్వ బీచ్ మహల్ పాఠశాలలో మున్సిపల్ చైర్మన్ ఆకస్మిక తనిఖీ

27-09-2026 | 10:10pm

విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలి: తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్

ఆలేరు, సెప్టెంబర్ 27: భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్(Municipal Chairperson Tangallapalli Srivani Ravikumar) ప్రభుత్వ బీచ్ మహల్ పాఠశాలను ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక కౌన్సిలర్ పచ్చాల జగన్మోహన్‌తో కలిసి మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు.

అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాల వంటశాలను పరిశీలించిన చైర్మన్ వంట పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, కిటికీలకు జాలి డోర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల సిబ్బందికి సూచించారు.

అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ రామచంద్రయ్యతో మాట్లాడి పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఇబ్బందులు కలగకుండా తక్షణమే ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారి (డిఇఓ)కు ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పచ్చాల జగన్మోహన్, టెంపుల్ చైర్మన్ చాగంటి సురేష్, పాఠశాల ప్రిన్సిపల్ రామచంద్రయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు