మండపాల వద్ద మున్సిపల్ వైస్ చైర్మన్ పూజలు

21-09-2026 | 05:04pm

నిర్మల్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణం(Nirmal Town)లోని వివిధ వార్డులో ప్రతిష్టించిన వినాయక విగ్రహ వద్ద మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి సోమవారం పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎస్పీ రాజు, కత్తి నరేందర్, నాందేడపు చిన్ను, పెండం శ్రీనివాస్, లక్కకుల హరీష్, ఆకుల రామకృష్ణ, కొండాజీ రాఘవేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు