ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రక్షిత మంచినీటి సదుపాయం

21-09-2026 | 05:20pm

రావులపల్లి దాతృత్వం అభినందనీయం

నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ చిన్న వెంకటరెడ్డి

నేరేడుచర్ల,సెప్టెంబర్21(విజయ క్రాంతి): ప్రముఖ పారిశ్రామికవేత్త రావులపల్లి ప్రసాద్, అరుణ దంపతుల దాతృత్వం అభినందనీయమని నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకటరెడ్డి(Nereducherla Municipal Chairman Konatham China Venkat Reddy) అన్నారు, సోమవారం స్థానిక పి ఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రావులపల్లి ప్రసాద్ అరుణ దంపతుల కుమార్తె అల్లుడు  గాయత్రి సంతోష్ ల కూతురు వేదాన్షి జన్మదిన సందర్భంగా రూ.1.10 లక్షలతో ఏర్పాటుచేసిన రక్షిత మంచినీటి ఆర్.ఓ ప్లాంటును ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ.... రావులపల్లి ప్రసాద్ గతంలో నేరేడుచర్లలో నివసించి ప్రస్తుతం వ్యాపార రిత్యా బెంగళూరులో స్థిరపడినప్పటికీ సొంత ఊరు మరచిపోకుండా ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ సహాయ సహకారాలు అందిస్తున్నారని, గతంలో మున్సిపాలిటీకి వైకుంఠ రథం, ఫ్రీజర్లు, పారిశుద్ధ సిబ్బందికి సన్మానం, పలు విద్యాలయాలకు, దేవాలయాలకు విరాళాలు అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు.

దాత రావులపల్లి ప్రసాద్ మాట్లాడుతూ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం 50 వేల రూపాయల స్కాలర్షిప్ లు అందజేస్తానని ప్రకటించారు, అంతేకాకుండా మాజీ సర్పంచ్ కొణతం సత్యనారాయణరెడ్డి క్రీడా సామాగ్రి కొనుగోలుకు 20 వేల రూపాయలు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు,మొదట జన్మదిన జరుపుకుంటున్న వేదాన్షి ని విద్యార్థులు పూలతో ఘన స్వాగతం పలికారు, అనంతరం కేక్ కట్ చేశారు, 

మరిన్ని వార్తలు