మండపాలను సందర్శించిన మున్సిపల్ వైస్ చైర్మన్

20-09-2026 | 04:49pm

నిర్మల్ సెప్టెంబర్ 20 ( విజయ క్రాంతి) :నిర్మల్ పట్టణంలోని వివిధ గణేష్ మండపాలను నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి(Nirmal Municipal Vice Chairman Appala Ganesh Chakravarthy) ఆదివారం సందర్శించి పూజలు చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో జరుపుకునేలా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ నాగరాజ్ పరవాడ బంగల్పేట్ బోయవాడ భాగ్యనగర్ ప్రియదర్శనగర్ కాలనీలో ఆయన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపీనాథ్ హరీష్, శ్రీనివాస్ ఎస్ పి రాజు నరేందర్ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు