ఢిల్లీలో హత్యచారం

19-09-2026 | 05:00am
  1. యువతిపై గ్యాంగ్‌రేప్.. ఆపై కత్తితో పొడిచి హత్య
  2. ముళ్లపొదల్లో మృతదేహం.. పీక్కుతిన్న కుక్కలు
  3. నలుగురు నిందితుల అరెస్ట్.. వారిలో ముగ్గురు మైనర్లు
  4. జార్ఖండ్ బాలికపై సామూహిక అత్యాచారం.. మర్డర్
  5. తీజ్‌లో అపహరించి.. ఘాతుకం
  6. ఇద్దరిని అదపులోకి తీసుకున్న పోలీసులు
  7. రాయ్‌గఢ్ జిల్లాలో మరో బాలికపై రేప్
  8. ఇద్దరు మైనర్లతో సహా ఐదుగురి అరెస్టు

న్యూఢిల్లీ/ముంబై/ రాంచీ, సెప్టెంబర్ 18: దేశంలో ఎన్ని కఠినమైన చట్టాలు ఉన్నా, శిక్షలు పడుతున్నా మహిళలపై, బాలికలపై దాడులు, అత్యాచారాలు(Rapes), హత్యలు ఆగడం లేదు. దేశ రాజధాని ఢిల్లీ(Delhi) నడిబొడ్డన ఓ బాలిక(Girl)పై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి(Gang rape) పాల్పడ్డారు. ఆపై పలుమార్లు కత్తితో పొడిచిపొడిచి హత్య చేసి, ముళ్లపొదల్లో పారేసి పరారయ్యారు. ఆమె మృతదేహాన్ని కుక్కలు పీక్కుతు న్నాయి. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేయగా.. వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు.

ఈ ఘటన వాయవ్య ఢిల్లీలోని స్వరూప్ నగర్ పోలీస్ స్టేషన్(Swaroop Nagar Police Station) పరిధిలో వెలుగుచూసింది. అలాగే జార్ఖండ్‌లో మరో బాలికపై దుండగులు గ్యాంగ్ రేప్ చేసి, గొంతు పిసికి హతమా ర్చారు. వైభవంగా జరుగుతున్న తీజ్ పండగలో ఆమెను అపహరించి.. నిర్మానుష్య ప్రాంతంలో ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో ఇద్దరి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే మహారాష్ట్ర(Maharashtra)లోని రాయ్‌గఢ్ జిల్లాలో కూడా మైనర్‌పై అత్యాచారం ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇంట్లోకి చొరబడి ఆమెను బెదిరించి పలుమార్లు లైంగిక దాడి చేశారు.

బాలిక గర్భవతి కావడంతో సదరు ఘటన బయటపడింది. ఈ ఘాతుకంలో ఇద్దరు మైనర్లతో సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మూడు రాష్ట్రాల్లో ఘటనలు శుక్రవారం వెలుగులోకి ఇచ్చాయి. ఢిల్లీలో 17 ఏళ్ల బాలికతో నలుగురు వ్యక్తులు పరిచయం చేసుకున్నారు. ఈ నెల 12న రాత్రి ఆమెను వారు ఒక గూడ్స్ టెంపోలో ప్రయాణిస్తున్న సమయంలోనే కలిసి మద్యం తాగారు. ఆ కదులుతున్న వాహనంలోనే బాలికపై సామూహి కంగా లైంగిక దాడికి పాల్పడ్డారు.

ఆపై నిందితులు బాలికను పథకం ప్రకారం కత్తితో సుమారు 8 సార్లు పొడిచి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం సెప్టెంబర్ 13న స్వరూప్ నగర్ కుషక్ రోడ్డులోని జైపాల్ రాణా పొలం సమీపంలో ఉన్న ముండ్ల పొదల్లో మృతదేహాన్ని పారేసి పరారయ్యారు. రెండు రోజుల తర్వాత లభించిన ఆ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి, కుక్కలు పీక్కుతినడం వల్ల కనీసం లింగ నిర్ధారణ కూడా చేయలేని దారుణ స్థితికి చేరుకుంది. ఈ నెల 15, 16 తేదీల మధ్య పోలీసులు రాత్రిపూట విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.

ఘటనా స్థలంలో ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడంతో సుమారు 50 సీసీఫుటేజీలను జల్లెడ పట్టారు. స్వరూప్‌నగర్ ప్రాంతంలోని ఖడ్డా కాలనీలో అనుమానిత టెంపోను, దాన్ని డ్రైవర్‌ను గుర్తించి నలుగురు నిందితులనూ అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు శివం అలియాస్ సుదామా అలియాస్ చూచూ(19) మేజర్, మిగతా ముగ్గురు మైనర్లని తెలిపారు. బీఎన్‌ఎస్, పోక్సో చట్టం కింద కింద కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

జార్ఖండ్‌లోనూ గ్యాంగ్‌రేప్..మర్డర్ 

జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలోని కుండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 14న రాత్రి తీజ్ పండుగను వైభవంగా నిర్వహిస్తున్నారు. యువత సంగీతం, నృత్యాలతో నిమగ్నమై ఉంది. నిందితులు ఆ బాలికను అపహరించి టెటార్తాండ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అంతటితో ఆగకుండా ఆమె ‘దుపట్టా’ (స్కార్ఫ్)తో గొంతు నులిమి చంపి, పొదల్లో పడేశారు. మరుసటి రోజు బాధితురాలి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనకు సంబంధించి బుధవారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని డీఎస్పీ సునీల్ కుమార్ సింగ్ తెలిపారు. నిందితులిద్దరూ నేరాన్ని అంగీకరించారని ఆయన చెప్పారు. కుండా పోలీస్ స్టేషన్‌లో బీఎన్‌ఎస్, పోక్సో చట్టం కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

రాయ్‌గఢ్ జిల్లాలో పలుమార్లు..

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో 17 ఏళ్ల బాలికకు పరిచయస్తులైన ఐదుగురు నిందితులు ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి ఆమెను లొంగదీసుకున్నారు. అంతేకాకుండా, ఏప్రిల్, జూన్ మధ్య కాలంలో, బాధితురాలి ఇంటి నిర్మాణ పనులు చేసిననో 40 ఏళ్ల మేస్త్రీ నిందితుల్లో ఒకడు ఉన్నాడు. ఆమె కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో లోపలికి చొరబడి ఆమెపై అత్యాచారం చేశాడు.

ఆ బాలిక 24 నుంచి 26 వారాల గర్భవతి అని తేలడంతో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. ఐదుగురిని అరెస్ట్ చేశామని, నిందితుల్లో ఇద్దరు మైనర్లని పోలీసులు తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా, మసాలా పోలీసులు బీఎన్‌ఎస్, పోక్సో చట్టం కింద ఐదుగురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు