లడ్డూ వేలం పాటలో ముస్లిం యువకుడు

24-09-2026 | 07:59pm

మాగనూరు: నారాయణపేట జిల్లా(Narayanpet District) మాగనూరు మండలంలోని నేరడగమ్ము గ్రామంలో వీరాంజనేయ దేవాలయం(Veeranjaneya Temple) దగ్గర ప్రతిష్టించిన వినాయకుని లడ్డు గురువారం నిర్వహించిన వేలం పాటలో ముస్లిం సోదరుడు(Muslim young man) కాజా మైనుద్దీన్ 26,001 వేల ఒక్క రూపాయకు లడ్డును కైవసం చేసుకొని తన భక్తిని చాటుకున్నాడు. ఈ సందర్భంగా వీరాంజనేయ దేవాలయం వినాయక మంటప కమిటీ సభ్యులు ముస్లిం సోదరుడు కాజా మైనుద్దీన్ సోదర భావంతో శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటమ్మ, చంద్రశేఖర్ రెడ్డి, ప్రకాష్, కమిటీ సభ్యులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు