నాని విశ్వరూపం! ‘ది ప్యారడైజ్’ రివ్యూ & రేటింగ్!

24-09-2026 | 08:26am

భారీ అంచనాలు, భారీ హైప్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ‘ది ప్యారడైజ్’ సినిమాకు(Nani The Paradise Review) మిశ్రమ స్పందన లభిస్తోంది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో అణచివేతకు గురైన ఓ వర్గం తమ గుర్తింపు, గౌరవం కోసం చేసే పోరాటాన్ని ప్రధానంగా చూపించినట్లు తెలుస్తోంది. సినిమాలో హీరో పాత్రలో జడల్‌తో నాని తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. పాత్రలోని భావోద్వేగాలను, పోరాట స్వభావాన్ని తన నటనతో బలంగా చూపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల్లో నాని పెర్ఫార్మెన్స్(Nani's performance) ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరోవైపు మోహన్ బాబు స్క్రీన్ ప్రజెన్స్(Mohan Babu) కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన కనిపించే సన్నివేశాలు ఆసక్తిని పెంచేలా ఉన్నాయని ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది.

సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీక్వెన్స్ హైలైట్‌గా నిలిచింది. అలాగే తల్లి-కొడుకు మధ్య నడిచే భావోద్వేగ సన్నివేశాలు కథకు ఎమోషనల్ బలం(Emotional strength) తీసుకొచ్చాయి. రాజకీయ అంశాలను కథలో భాగంగా మలిచిన విధానం కూడా కొంతమందిని ఆకట్టుకుంటోంది. అయితే ఫస్టాఫ్‌లో ఏర్పడిన అంచనాలను సెకండాఫ్ పూర్తిస్థాయిలో అందుకోలేకపోయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొన్ని సన్నివేశాల్లో కథనం నెమ్మదించడం, కథను మరింత ప్రభావవంతంగా ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉండేదనే విమర్శలు వస్తున్నాయి. అలాగే సినిమాలో వయలెన్స్ మోతాదు ఎక్కువగా ఉందని కొంతమంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో సౌండ్ మిక్సింగ్ కూడా ఇబ్బందికరంగా అనిపించిందనే టాక్ వినిపిస్తోంది.

ఓవరాల్‌గా ఎట్లుందంటే?

మొత్తంగా ‘ది ప్యారడైజ్’లో నాని నటన, మోహన్ బాబు స్క్రీన్ ప్రజెన్స్, ఇంటర్వెల్ సీక్వెన్స్, తల్లి-కొడుకు ఎమోషనల్ ట్రాక్ ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. అయితే సెకండాఫ్ ఎగ్జిక్యూషన్, అధిక వయలెన్స్, సౌండ్ మిక్సింగ్ వంటి అంశాలు మైనస్‌లుగా మారాయి.

 రేటింగ్: ⭐ 2.25/5

మరిన్ని వార్తలు