రేపు సెలవు.. వివరాలు ఇవే!

24-09-2026 | 07:11am

హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో వినాయక నిమజ్జన(Ganesh immersion) కార్యక్రమాలు భారీగా జరిగే నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో శుక్రవారం సెలవు ప్రకటించింది. నిమజ్జనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటం, ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, సంబంధిత సంస్థలకు సెలవు వర్తించనుంది.

మరోవైపు ఈ సెలవుకు బదులుగా నవంబర్ 14న రెండో శనివారం పని దినంగా ప్రభుత్వం ప్రకటించింది. అంటే రేపటి సెలవుకు ప్రత్యామ్నాయంగా నవంబర్ 14న కార్యాలయాలు సాధారణంగా పనిచేయనున్నాయి. గణేశ్ నిమజ్జనం సందర్భంగా నగరంలో భారీ ఊరేగింపులు నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు కూడా ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు(Special traffic restrictions), భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రధాన నిమజ్జన మార్గాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు