‘ది ప్యారడైజ్‌’.. కలెక్షన్ల లెక్క ఇదేనా..?

23-09-2026 | 03:58pm

నాని హీరోగా తెరకెక్కిన ‘ది ప్యారడైజ్‌’ సెప్టెంబర్‌ 24న థియేటర్ల(Theatres)లో విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ హైప్‌(Hype) నెలకొనడంతో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా అదే స్థాయిలో జరిగినట్లు సమాచారం. నిర్మాత సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రానికి రూ.150 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా సుమారు రూ.100 కోట్ల వరకు వచ్చాయని సమాచారం. ఇందులో నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ హక్కులు దాదాపు రూ.50 కోట్లు, ఆడియో రైట్స్‌ రూ.15 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌ బిజినెస్‌ సుమారు రూ.100 కోట్లుగా ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. బ్రేక్‌ ఈవెన్‌ కోసం రూ.100 కోట్ల షేర్‌, అంటే దాదాపు రూ.200 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించాల్సి ఉంటుందని అంచనా.

మరిన్ని వార్తలు