అటవీ అమరవీరుల త్యాగం చిరస్మరణీయం

11-09-2026 | 11:51pm

అడవులు, వన్యప్రాణుల పరిరక్షణలో వారి సేవలు స్ఫూర్తిదాయకం

 గజ్వేల్: ములుగు(Mulugu)లోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థలో శుక్రవారం జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని(National Forest Martyrs Day) నిర్వహించారు. అడవులు, వన్యప్రాణులు, సహజ వనరుల పరిరక్షణలో విధి నిర్వహిస్తూ ప్రాణత్యాగం చేసిన అటవీ సిబ్బందికి ఘన నివాళులు అర్పించారు. కళాశాల డీన్‌ బి. ప్రవీణ, ఐఎఫ్‌ఎస్‌ మాట్లాడుతూ అటవీ అమరవీరుల దినోత్సవం ప్రాధాన్యతను వివరించారు. అటవీ, వన్యప్రాణుల సంరక్షణలో ఫారెస్ట్‌ గార్డులు, క్షేత్రస్థాయి సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది త్యాగాలను స్మరించుకుంటూ డీన్‌, అధ్యాపకులు, విద్యార్థులు నివాళులు అర్పించారు. వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రకృతి సంపద పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు