4 September, 2026 | 10:46 PM

Breaking News

ఉమ్రిలో ఘనంగా మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం   •   శిరీష కుటుంబానికి అండగా నిలవాలి   •   మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి   •   బాన్సువాడలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు   •   హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •   భక్తి, ఆధ్యాత్మికతతోనే సమాజంలో ఐక్యత   •  

నెతన్యాహు యుద్ధనేరస్థుడు

20-07-2026 | 02:10am

న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ వ్యాఖ్యలు

న్యూయార్క్, జూలై 19: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యుద్ధ నేరగాడని, సెప్టెంబర్‌లో (యూఎన్‌జీఎ) యూనైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సర్వసభ్య సమావేశం 81వ సెషన్‌లో పాల్గొనేందుకు ఆయన న్యూయార్క్‌ను సందర్శించినప్పుడు అరెస్టు విషయంపై చట్టపరమైన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం న్యూయార్క్‌లో మీడియాతో మాట్లాడారు.

నెతన్యాహు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)ని ఎదుర్కోవాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అనేక ఏళ్లుగా నెతన్యాహు సృష్టించిన వినాశం ఇంతా అంతా కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అతని అరెస్టుపై న్యూయార్క్ నగరంలోని చట్టం అనుమతించినదంతా చేస్తుందని, నిపుణులతో తాను కూడా చర్చిస్తున్నట్లు వివరించారు. ఇజ్రాయెల్ గాజాలో సైనిక చర్యను నిందించారు. కాగా 2024లో నెతన్యాహు, మరికొంతమందిపై ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రభుత్వంలో ఇజ్రాయెల్‌ను విమర్శించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది  మమ్దానీయే.