ఇందిరమ్మ ఇళ్లతో కొత్త వెలుగులు:సర్పంచ్ నరేష్ నాయక్

09-09-2026 | 04:42pm

కోనరావుపేట, సెప్టెంబర్ 09 (విజయక్రాంతి): పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని జై సేవాలాల్ భూక్యా రెడ్డి(Sevalal Bhukya Reddy) తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ నరేష్ నాయక్ అన్నారు. బుధవారం గ్రామ పంచాయతీ పరిధిలో లబ్ధిదారు లకావత్ సరిత–భికన్ నాయక్ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ నరేష్ నాయక్ మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి సురక్షితమైన, గౌరవప్రదమైన నివాసం ఉండటం ఎంతో ముఖ్యమన్నారు. ఇల్లు కేవలం నాలుగు గోడలు మాత్రమే కాదని, కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవం, భవిష్యత్తుపై భరోసా కల్పించే చిరునామా అని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేద కుటుంబాల సొంతింటి కల నెరవేరుతోందన్నారు.గ్రామంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో గృహ నిర్మాణ పథకాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో సహకరిస్తున్న ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు సర్పంచ్ నరేష్ నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యే చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజు నాయక్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నాయకులు రమేష్, ఆత్మ కమిటీ సభ్యుడు తిరుపతి, బల్కార్ రాజు, మంగ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు