కరీంనగర్ లో నూతన ట్రాఫిక్ ఔట్‌పోస్ట్ బూత్‌లు ప్రారంభం

19-09-2026 | 02:39pm

కరీంనగర్ క్రైం, సెప్టెంబర్ 19,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా తెలంగాణ చౌక్(Telangana Chowk), మంచిర్యాల చౌరస్తాలో ఏర్పాటు చేసిన నూతన ట్రాఫిక్ ఔట్‌పోస్ట్ లను సిపి గౌష్ ఆలం శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడంతో పాటు నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ ఔట్‌పోస్ట్ బూత్‌లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామితో పాటు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు సంజీవ్, అంజయ్య, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు