30 ఏళ్ల ప్రేమకథ.. ఇప్పటికీ ఎవర్‌గ్రీన్

06-10-2026 | 08:11am

టాలీవుడ్ క్లాసిక్స్‌లో (Tollywood Classics) ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తయ్యాయి. అక్కినేని నాగార్జున, టబు జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ (Romantic Family Entertainer) ఇప్పటికీ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నటి టబు (Tabu) సోషల్ మీడియాలో (Social Media) ఆనాటి మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. సినిమాలోని కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. మూడు దశాబ్దాలుగా ఈ ప్రేమకథ ప్రేక్షకులను అలరిస్తూనే ఉందని పేర్కొన్నారు. సినిమా కథ, పాటలు ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానంలో నిలిచిపోతాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి: శ్రీవిష్ణు మార్క్ కామెడీ పక్కా..

కృష్ణవంశీ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున నిర్మించారు. నాగార్జున ‘శీను’గా, టబు ‘మహాలక్ష్మి’ అలియాస్ ‘పండు’గా ఆకట్టుకున్నారు. రవితేజ, చంద్రమోహన్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విడుదల సమయంలో బాక్సాఫీస్‌ (Box Office) వద్ద ఘన విజయం సాధించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 1996లో ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం (National Award) కూడా దక్కించుకుంది. సందీప్ చౌతా సంగీత దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమైన చిత్రం కూడా ఇదే కావడం విశేషం.

మరిన్ని వార్తలు