కరెంట్ బిల్లు మోత మోగనుందా?
తెలంగాణలో విద్యుత్ ఛార్జీలకు (Power Tariffs) సంబంధించి తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (TGERC) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. డిస్కంలు (DISCOMs) రూ.5,420 కోట్ల మేర ట్రూ-అప్ ఛార్జీలను (True-up Charges) వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో విద్యుత్ వినియోగదారులపై (Electricity Consumers) ట్రూ-అప్ ఛార్జీల భారం పడనుంది. గతంలో విద్యుత్ కొనుగోలు, సరఫరా తదితర వ్యయాల్లో ఏర్పడిన వ్యత్యాసాలను సర్దుబాటు చేసేందుకు ఈ ఛార్జీలను వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.
TGERC (Telangana Electricity Regulatory Commission) ఆదేశాలతో డిస్కంలు ఈ మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నాయి. దీంతో రాష్ట్రంలో విద్యుత్ బిల్లులపై అదనపు భారం పడే అవకాశం ఉంది.