22 August, 2026 | 5:05 AM

కట్టా సురేష్‌కు ఎన్‌ఆర్‌ఐవీఏ జీవితకాల సాఫల్య పురస్కారం

22-08-2026 12:15 AM

ముషీరాబాద్ ,ఆగస్టు 21(విజయక్రాంతి): బిగ్ డేటా, క్లినికల్ అనలిటిక్స్ రంగాల్లో దశాబ్దాలుగా అందించిన విశేష సేవలు, సాంకేతిక ఆవిష్కరణలకు గుర్తింపుగా కట్టా సురేష్ కు ఎన్‌ఆర్‌ఐ వాసవి అసోసియేషన్ (ఎన్‌ఆర్‌ఐవీఏ) 8వ గ్లోబల్ కన్వెన్షన్లో జీవితకాల సాఫల్య పురస్కారం ప్రదానం చేసింది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన కట్టా సురేష్ ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. బిగ్ డేటా భావన పెద్దగా ప్రాచుర్యంలోకి రాకముందే 1997లో సామా టెక్నాలజీస్ను స్థాపించి, భారీ స్థాయి డేటా విశ్లేషణ రంగంలో సంస్థను అభివృద్ధి చేశారు.

ఆయన నాయకత్వంలో సామా టెక్నాలజీస్ రూపొందించిన బిగ్ డేటా ఆధారిత క్లినికల్ అనలిటిక్స్ సాంకేతికతలు కోవిడ్-19 సమయంలో వ్యాక్సిన్ అభివృద్ధి, క్లినికల్ ట్రయల్ డేటా విశ్లేషణలో ఉపయోగపడ్డాయని నిర్వాహకులు తెలిపారు. బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లినికల్ అనలిటిక్స్ రంగాల్లో కట్టా సురేష్ చేసిన దీర్ఘకాలిక సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని వాసవి అసోసియేషన్ మాజీ చైర్మన్ సుంకు జైసింహ, ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అందజేశారు.