కుంటలో పడి 16 ఏళ్ల బాలుడి మృతి

24-10-2026 | 11:35am

గజ్వేల్, అక్టోబర్ 24: తల్లిదండ్రులతో గొడవపడి అర్ధరాత్రి కుంటలో దూకి ఓ యువకుడు ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. ఈ ఘటన గజ్వేల్ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలోని పల్లెపహాడ్‌ సమీపంలో ఉన్న లింగరాజుపల్లి కుంట వద్ద చోటుచేసుకుంది. వేములఘాట్‌(Vemulaghat)కు చెందిన పార్థం ప్రదీప్‌ (16)గా మృతుడిని గుర్తించారు.

తల్లిదండ్రులతో గొడవ పడిన ప్రదీప్‌ అర్ధరాత్రి సమయంలో కుంటలో దూకినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం కుంటలో మృతదేహం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు