తల్లీబిడ్డల ఆరోగ్యానికి పౌష్టికాహారం కీలకం

11-09-2026 | 12:20am

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలోని అంజనాపురం గ్రామం(Anjanapuram village)లో గురువారం సీమంతం, అన్నప్రసన వేడుకల(Annaprasana ceremony)ను నిర్వహించారు. కార్యక్రమానికి సర్పంచ్ బానోత్ నరసింహ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం(Nutrition) ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు.

గర్భిణులు సమతుల ఆహారంతో పాటు ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు. గర్భధారణ సమయంలో టీకాలు తప్పనిసరిగా వేయించుకోవడంతో పాటు అదనపు పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. పౌష్టికాహారం శిశువు ఎదుగుదలకు, భవిష్యత్తు ఆరోగ్యానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు