ఒగ్గు కళాకారుల సమస్యలు పరిష్కరించాలి
ఎమ్మెల్యేను కలిసిన ఒగ్గు కళాకారుల సంఘం నాయకులు
రాజాపూర్: తెలంగాణ రాష్ట్రంలో ప్రాచీనమైన ఒగ్గు కలను నమ్ముకొని జీవిస్తున్న ఒగ్గు కళాకారుల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం జిల్లా ఒగ్గు సంఘం కళాకారులు(Oggu community artists) ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(MLA Anirudh Reddy)ని కలిశారు. ఈ నెల 7న రాజాపూర్ మండల(Rajapur Mandal) కేంద్రంలోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం వద్ద మహబూబ్నగర్ జిల్లా ఒగ్గు బీర్ల కళాకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యేకు తెలిపారు. ఈ సందర్భంగా నూతన ఒగ్గు కళాకారుల కమిటీని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఒగ్గు కళాకారుల సంఘం నాయకులు రాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.