విద్యుత్ కోతలపై కన్నెర్ర

13-09-2026 | 05:05am
  1. పలు ప్రాంతాల్లో రైతుల నిరసనలు, రాస్తారోకోలు
  2. సబ్ స్టేషన్ల ఎదుట బైఠాయింపు
  3. కోతలు విధించవద్దని డిమాండ్
  4. సిద్దిపేట జిల్లాలో ఆపరేటర్ నిర్బంధం

కామారెడ్డి, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి)/గాంధారి/నిజాంసాగర్: అప్రకటిత విద్యుత్ కోతల(Power cuts)తో పంటలు(Crops) ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. శనివా రం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు, సబ్ స్టేషన్ల(substations) ఎదుట నిరసనలు వ్యక్తం చేశారు. పంటలు ఎండుతున్న  విద్యుత్ అధికారులు(Electricity officials) పట్టించుకోవడంలేదని రైతులు(Farmers) ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన 13 గంటల వ్యవసాయ విద్యుత్ సరఫరా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

పంటలు ఎండిపోకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.  భారతీయ కిసాన్ సంగ్ ఆధ్వర్యంలో కామారెడ్డి సబ్ స్టేషన్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. నిరంతర విద్యుత్ సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని బీఎంఎస్ జిల్లా అధ్యక్షుడు విట్టల్‌రెడ్డి అన్నారు. గంటపాటు ధర్నా నిర్వహించారు. ఎస్సీ సాల్య నాయక్ చేరుకొని నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. రెండు రోజుల్లోనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు.

ధర్నాలో సదాశివ నగర్, గాంధారి, కామారెడ్డి, మాచారెడ్డి మండలాల రైతులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ జ డ్పీటీసీ హరాలే తానాజీ రావ్ మాట్లాడు తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన నుంచి అప్రకటిత కరెంట్ కోతలతో రైతన్నలు చా లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను నిండా ముంచుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తమ ప్రభుత్వం రాబోతుందని , తమ పార్టీ అధికారంలోకి రాగానే గతంలో లాగే రైతుల శ్రేయస్సు కోసం చిత్తశుద్ధితో పని చేస్తామని ఆయన అ న్నారు. ఈ ధర్నా వల్ల రోడ్డుకు ఇరు వైపు ల వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి.

ధర్నాలో గ్రామపంచాయతీ వార్డు స భ్యుడు పత్తి సాయిలు, సంజీవ్, మాజీ ఏఎం సీ వైస్ చైర్మన్ రెడ్డి రాజులు, మాజీ ఉప సర్పంచ్ కొ మ్ముల రమేష్,మాజీ కోప్షన్ మెంబర్ ము స్తఫా, పలువురు నాయకులు, స్థానిక రైతు లు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల రైతులు మంగళూరు గ్రామ శివారులోనీ జాతీయ రహదారి 161పై రా స్తారోకో నిర్వహించారు. మండలంలోని వెలగనూరు, మంగుళూరు, నర్సింగరావుపల్లి, గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. 

వనపర్తి జిల్లాలో

వనపర్తి: అప్రకటిత విద్యుత్ కోతలతో ప ంటలు ఎండిపోతున్నాయని వనపర్తి మండ లం నాచహల్లి, కృష్ణగిరి, పెద్దగూడెం తండా, సవాయిగూడెం గ్రామాలకు చెందిన రైతులు శనివారం సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. వనపర్తి ప్రధాన రహదారి పై బైఠాయించారు. సమాచారం అందుకు న్న ఏఈ చంద్రశేఖర్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డీఈతో మాట్లాడించాలని రైతులు పట్టుబట్టడంతో ఏఈ ఫోన్ ద్వారా డీఈతో మాట్లాడించారు. 

సిద్దిపేట జిల్లాలో

నంగునూరు/కొండపాక(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొం డంరాజుపల్లి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. గట్లమల్యాల, కొండంరాజుపల్లి, ఘనపూర్, ఖాతా గ్రామాల నుంచి తరలివచ్చిన రైతులు సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నిరంతరం ట్రిప్పులవుతూ, మోటార్లు కాలిపోతున్నాయిని మండిపడ్డారు. ఆందోళనలో భాగంగా విద్యుత్ శాఖ ఏఈకి వినతి పత్రం అందజేసేందుకు రైతులు దాదాపు 40 నిమిషాల పాటు వేచి చూశారు.

ఏఈ మారుతి అక్కడికి రాకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సబ్‌స్టేషన్ ఆపరేటర్ నరేశ్‌ను కార్యాలయ గదిలో నిర్బంధి ంచారు. సమాచారం అందుకున్న లైన్ ఇన్‌స్పెక్టర్ రాములు చేరుకుని రైతులతో మాట్లా డారు. రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ నిరసనలో సర్పంచులు గణపురం సాయిలు, ఇంగే నరేశ్, లక్ష్మారెడ్డి, వీర్యానాయక్, వేణు, ఓజాలు, మహేష్, కనకయ్య, రఘుపతి, దశమంతా రెడ్డి,బ్రహ్మచారి, సంపత్, శ్రీనివాస్ ,చింటు, బన్నీ , అనిల్ పాల్గొన్నారు. కొండపాక మండలం బందారం, అంకిరెడ్డిపల్లి, దర్గా, రాంపల్లి, దుద్దెడ గ్రామాలకు చెందిన రైతులు దుద్దెడ విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద రాజీవ్ రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యుత్ శాఖ ఏఈ సత్యంకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఏఈ సత్యం డీఈతో మాట్లాడామని, ఆదివారం నుంచి పాత పద్ధతి ప్రకారం విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారం కాకపోతే మరోసారి రాజీవ్ రహ దారిపై ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మాజీ కోఆర్డినేటర్ ర్యాగల్ల దుర్గయ్య, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నూనె కుమార్, బీ జేపీ మండల అధ్యక్షుడు నీల సత్యం, దుద్దె డ సర్పంచ్ మిద్దె శివకుమార్, అంకిరెడ్డిపల్లి సర్పంచ్ గాలి బాలయ్యతో పాటు పలువురు నాయకులు, ఐదు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

సూర్యాపేట జిల్లాలో

సూర్యాపేట (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా సూర్యాపేట మం డలం యర్కా రంసబ్ స్టేషన్‌ను రైతు లు ముట్టడించి  జనగామ-సూర్యాపేట రహదారిపై రాస్తారోకో చేశారు. సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫి క్ నిలిచిపోయింది. సమాచారం అం దుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ అధికారులతో మాట్లాడి రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.

మరిన్ని వార్తలు