గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ గడ్డం భాస్కర్

05-10-2026 | 09:08pm

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ కు అవకాశం ఇవ్వాలి - పద్మశాలి సంఘం

జనగామ,(విజయక్రాంతి) : రానున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా పద్మశాలి ముద్దుబిడ్డ ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ కు అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం(Padmashali Association) మీడియా ఇన్చార్జి చింతకింది కృష్ణమూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ... రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5)(Article 171(5)) ప్రకారం సామాజిక రంగంలో ప్రత్యేక జ్ఞానం, అనుభవం ఉన్న వ్యక్తులను గవర్నర్ కోటా(Governor's quota) ద్వారా శాసనమండలికి నామినేట్ చేయవచ్చన్నారు. జనాభాలో అధికంగా ఉన్న పద్మశాలీలకు ఈ అవకాశం కల్పిస్తే న్యాయం చేసినట్లు అవుతుందని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(PCC President Mahesh Kumar Goud) చొరవ చూపాలని కోరారు.

మరిన్ని వార్తలు