పాపన్న పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం
19-08-2026 12:33 AM
ఎమ్మెల్యే సత్యనారాయణ రావు
భూపాలపల్లి, ఆగస్టు 18 (విజయ క్రాం తి): బహుజన రాజ్య స్థాపన, సామాజిక న్యా యం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రా వు అన్నారు.
మంగళవారం జిల్లా కేంద్రంలో ని ఐడీఓసీ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ చిత్రపటానికి కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పూలమా లలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక అసమానతలు, దోపిడీ, భూస్వామ్య, పెత్తందారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా 17వ శతాబ్దంలోనే పాపన్న గౌడ్ ధైర్యంగా పోరాడారని కొనియాడారు.






