బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాఘవేంద్ర యాదవ్
ఎల్బీనగర్, అక్టోబర్ 23 : బీజేవైఎం రంగారెడ్డి జిల్లా(BJYM Ranga Reddy District ) ప్రధాన కార్యదర్శిగా ఈరాటి రాఘవేంద్ర యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడిగా పారంద సాయిని నియమిస్తూ శుక్రవారం బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సాయిరాం గౌడ్ నియమకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ... యువతను పార్టీ వైపు ఆకర్షించి, యువమోర్చాను మరింత బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తానన్నాను.
బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బోల్గం యశ్పాల్ గౌడ్, బండారి భాస్కర్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేశ్, జిల్లా అధ్యక్షుడు శ్రీ పొట్లపల్లి సాయికుమార్ గౌడ్, జిల్లా కార్యదర్శి నరేశ్ యాదవ్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.