ప్యారడైజ్ ఎమోషన్స్ కదిలిస్తాయి
నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్(Pan-India period action entertainer) ‘ది ప్యారడైజ్(The Paradise)’. శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో, ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ బెంగళూరులో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. “ప్యారడైజ్’ నా కెరీర్‌లో చాలా ప్రతిష్టాత్మక చిత్రం. నా కెరీర్‌లో ఎక్కువ రోజులు షూటింగ్ చేసింది, ఎక్కువ హార్డ్ వర్క్ చేసిందీ ఈ సినిమాకే. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతి అందించడానికి మేము ఎక్కడా రాజీ పడకుండా పనిచేశాం.
ఇది యాక్షన్ డ్రామా. ఈ జానర్‌లో చాలా సినిమాలు వచ్చి ఉండొచ్చు. కాకపోతే ‘ప్యారడైజ్’ లాంటి ఇంటెన్సిటీ, వరల్డ్ బిల్డింగ్, ఎనర్జీ, ఎమోషన్స్ ఉన్న సినిమా ఇప్పటివరకు రాలేదు. ఇందులో ఉండే ఎమోషన్ అందరినీ కదిలిస్తుంది. కన్నడలో నా క్యారెక్టర్‌కు దీక్షిత్ డబ్బింగ్ చెప్పాడు. ఈ సినిమా కన్నడలో చాలా మంచి క్వాలిటీతో డబ్ చేశాం. తెలుగు, కన్నడ(Telugu, Kannada) రెండు భాషల్లోనూ ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో జడల ట్రెండ్ మళ్లీ మొదలవుతుందని భావిస్తున్నా” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు.