అభివృద్ధి, ప్రజా సమస్యలపై సమీక్షించిన పరిగి ఎమ్మెల్యే టీఆర్ఆర్
మహమ్మదాబాద్,(విజయక్రాంతి): మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని జూనియర్ కాలేజ్ మీటింగ్ హాల్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి(Pargi MLA Dr. T. Rammohan Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మండల అభివృద్ధి, ప్రజా సమస్యలపై సమీక్ష నిర్వహించారు. మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యలపై చర్చించారు. ప్రజల సమస్యలను అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
అనంతరం సెక్పల్లి, అన్నారెడ్డిపల్లి నూతన గ్రామపంచాయతీ కార్యాలయాలను ప్రారంభించారు. మహమ్మదాబాద్(Mahammadabad), మొకర్లాబాద్ రైతు వేదికల్లో లబ్ధిదారులకు నూతన రేషన్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాంలాల్, మండల స్పెషల్ ఆఫీసర్ శివానంద స్వామి, తహసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి, ఎంపీడీవో నరేందర్ రెడ్డి, ఎంఈవో రాజు నాయక్, శాంతిరంగ్యా, రాధారెడ్డి, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.