మళ్లీ రచ్చ తప్పదా ?
- మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు నఖ్వీ
- ట్రోఫీ ఇచ్చేందుకు వస్తున్న పీసీబీ చీఫ్
- గెలిస్తే నఖ్వీ చేతుల మీదుగా తీసుకునేందుకు భారత్ నో
- రెచ్చగొట్టేందుకే ప్లాన్ చేసిన నఖ్వీ
దుబాయి, సెప్టెంబర్ 6 : మహిళల ఆసియా కప్(Womens Asian Cup) హోరాహోరీగా సాగుతోంది. అయితే ఈ టోర్నీ ఫైనల్లో రచ్చ తప్పేలా లేదు. టైటిల్ గెలిచిన జట్టుకు ట్రోఫీ తానే అందజేస్తానంటూ పాక్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్(Asian Cricket Council) చైర్మన్ మోసిన్ నఖ్వీ(Mohsin Naqvi) పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఈ మెగా టోర్నీలో భారత మహిళల జట్టు(Indian womens team) టైటిల్ రేసులో దూ సుకుపోతోంది. ఇప్పటికే సెమీస్ చేరిన భారత్(India) ఫామ్ చూస్తే ట్రోఫీ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఫైనల్లో భారత్ గెలిస్తే ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ హోదాలో ట్రోఫీ ఇ చ్చేందుకు నఖ్వీ సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం ఇది వివాదాస్పదంగా మారింది. ఫైనల్ మ్యాచ్ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి, విజేత జట్టుకు ట్రో ఫీని అందజేయనున్నట్లు సమాచారం. అ యితే ఈ పర్యటన క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2025 పురుషుల ఆసియా కప్ ఫైనల్లో భారత్ గెలిచినప్పుడు, మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత జ ట్టు నిరాకరించింది. దీంతో ఆ ట్రోఫీ ఇప్పటికీ దుబాయ్‌లోని ఏ సీసీ ఆఫీసులోనే ఉండిపోయింది. ప్రస్తుతం హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు ఇప్పటికే సెమీఫైనల్‌కు దూ సుకెళ్లింది.
ఒకవేళ భారత్ ఫైనల్ చేరి టైటిల్ గెలిస్తే, గతేడాది లాగే నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు నిరాకరించే అవకాశం ఉందని తెలిసింది. దీనిపై బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన భారత్- పాకిస్తాన్ మహిళల మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు కరచాలనం చేసుకోకపోవ డం కూడా ఈ వివాదానికి ఆజ్యం పోసింది. భారత్ ఛాంపియన్‌గా నిలిస్తే, మళ్లీ ముగిం పు వేదికపై నాటి నాటకీయ పరిణామాలే పునరా వృతమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణ యాల తీరుపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్య క్తం చేస్తున్నారు. ఏసీసీ అధ్యక్షుడిగా నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన నఖ్వీ, తన పంతా న్ని నెగ్గించుకోవడానికి చూస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఉద్దేశ పూర్వకంగానే ట్రో ఫీ తానే ఇచ్చేందుకు నఖ్వీ పట్టుపడుతున్న ట్టు వార్తలు వస్తున్నాయి. ఏసీసీ ప్రతినిధు లు వారిస్తున్నా వినడం లేదని తెలుస్తోంది.