తెలుగు రాష్ట్రాల్లో ప్రజా‘కేంద్ర’ పాలన
ఉభయ తెలుగు రాష్ట్రాల(Telugu states) ముఖ్యమంత్రులు(Chief Ministers) తమవి ప్రజా ప్రభుత్వాలని చెప్పుకుంటున్నారు. ఇరువురూ ఒకనాడు ఒకే పార్టీ వారు. ఇప్పుడు భిన్న ధృవాలుగా ఉన్నారు. అయినా ఇరువురి మధ్య సత్సంబంధాలు ఉండటం ఆదర్శనీయం. కాగా, పరి‘పాలన’లో మాత్రం తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు(AP CM Chandrababu Naidu) అడ్మినిస్ట్రేషన్‌లో తనదైన ముద్ర వేసు కుంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాక్షేమం(Government Employees and Public Welfare) కోసం పని చేయాలనే సందేశాన్ని ఇస్తున్నారు.
ఐఏఎస్ ఆఫీసర్ల(IAS officers)ను సైతం సమస్యల పరిష్కారంపై నిలదీస్తున్నారు. మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేల పనితీరునూ రివ్యూ చేస్తున్నారు. ఇందుకు భిన్నమైన పరిస్థితి తెలంగాణలో ఉంది. తొలిసారి సీఎం అయిన రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఇంకా పాలనలో పట్టు సాధించినట్లు కనిపించడం లేదు. తన కేబినెట్లో ఇంకా మూడు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా కొండా సురేఖ(Konda Surekha) కేబినెట్ నుంచి బర్తరఫ్ అయ్యారు. ఇక నామినేటెడ్ పోస్టుల కోసం నేతలు వేచి చూస్తున్నారు.
ఈ క్రమంలో పార్టీ పరమైన రాజకీయ అంశాలనూ ప్రభుత్వ అధినేతగా తన పని తీరు పట్ల సంతృప్తికర స్థాయి ప్రజలలో ఉండేలా రేవంత్‌రెడ్డి తన నాయకత్వ పటిమను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇచ్చిన హామీలను పక్కనబెడితే ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకునే పరిస్థితి రేవంత్ సర్కారులో కనిపిస్తలేదు. దీనికి తోడు కేంద్రంనుంచి అంతగా మద్దతు లేదు. అయినా రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధికి ఆనవాళ్లుగా మారాలంటే తప్పక ముఖ్యమంత్రులు ఇరువురూ తమ కేబినెట్ సహచరులు, ఎమ్మెల్యేల సహకారంతో ఇంతకు మించిన స్థాయిలో నిజాయితీగా పని చేయాలి.
అంబీర్ శ్రీకాంత్ సెల్ : 81859 68059.