ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

24-09-2026 | 05:11pm

ఘట్ కేసర్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి) : ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను  సద్వినియోగం చేసుకోవాలని మాజీ సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్(Former Sarpanch Oruganti Venkatesh Goud) అన్నారు.  ఘట్కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధి కొర్రెములలో గురువారం కొండాపూర్ విజ్ణాన్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల, స్ఫూర్తి ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఎల్ బి నగర్ కామినేని హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరాన్ని ఆయన  ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణంలో వస్తున్న మార్పులు, తీసుకుంటున్న ఆహారం, ఉంటున్న జీవన శైలితో ఎన్నో రకాల వ్యాదులు వస్తున్నాయని, అనారోగ్యాల నుండి జాగ్రత్త పడడానికి ఉచిత వైద్య శిభిరాలను సద్వినియోగం చేసుకోవలని కోరారు. ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం ఎన్ఎస్ఎస్ విద్యార్థులు టీములుగా ఏర్పడి గ్రామంలో సమస్యలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అప్పారావు నాయుడు, స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ళ యాదగిరి, ఉపాధ్యక్షుడు మేకల పద్మారావు, ప్రధాన కార్యదర్శి కంది సత్యనారాయణ, సభ్యులు పరుశరాం, మాజీ ఎంపిటీసి బొడ్డు వినోద నాగార్జున, మాజీ ఉపసర్పంచులు కందుల రాజు, బొడ్డు నాగార్జున, మాజీ వార్డు సభ్యులు దయ్యాల అంజనేయులు, కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ శ్రీలత, కామినేని హాస్పిటల్ మార్కెటింగ్ అధికారి బాలకృష్ణ,

వైద్యులు గైనకాలజిస్ట్ సుధ, ఆర్థోపిడిక్ మోక్సిత, జనరల్‌ ఫిజిషియన్ సమంత, కార్తిక్, నాయకులు తరిణే మహేంద్ర చారి, మాటూరి రవి, నర్సింహా ఎన్ఎస్ఎస్ కోఅర్డినేటర్లు చంద్రశేఖర్, రమ్య, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు