అకాల వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పువ్వాళ్ళ దుర్గాప్రసాద్
ఖమ్మం, విజయక్రాంతి: వర్షాలు(rains) కురుస్తున్న సమయంలో తడిసిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లు, ఇతర విద్యుత్ పరికరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చిన్నారులు వర్షపు నీటిలోకి వెళ్లకుండా, విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. మరోవైపు మున్నేరు వరద పరిస్థితిపై చైర్మన్(Puvvalla Durgaprasad) సంబంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు. మున్నేరు ప్రవాహానికి సంబంధించిన ఎగువ ప్రాంతాలు, మున్నేరులో కలిసే అకేరు, పాలేరు పరివాహక ప్రాంతాలతో పాటు ఖమ్మం రూరల్, పోలేపల్లి, తీర్థాల తదితర పరిసర ప్రాంతాల్లో వర్షపాతం, వరద ఉధృతి, నీటి మట్టం పరిస్థితిపై అధికారులు అందిస్తున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
మున్నేరు పరివాహక ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎక్కడైనా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంటే ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను సుడా చైర్మన్ కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. “ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. వర్షాల సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి” అని సుడా చైర్మన్ శ్రీ పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.