రాకాసిపేటకు చెందిన వ్యక్తి అదృశ్యం
27-09-2026 | 10:54pm
ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు.. సమాచారం ఉంటే తెలియజేయాలని విజ్ఞప్తి
బోధన్, సెప్టెంబర్ 27 (విజయ క్రాంతి) : బోధన్ పట్టణంలోని(Bodhan town) రాకాసిపేట ప్రాంతానికి చెందిన అసత్వార్ నాగనాథ్(Asatwar Naganath) (46) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు(Complaint lodged with the police) చేశారు. ఈ నెల 23వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన నాగనాథ్ తిరిగి ఇంటికి చేరుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కుటుంబ సభ్యులు బంధువులు, పరిచయస్తుల వద్ద ఆరా తీసినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. నాగనాథ్ ఆచూకీ తెలిసిన వారు లేదా ఎక్కడైనా కనిపించినట్లయితే వెంటనే క్రింది ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
సమాచారం అందించాల్సిన నంబర్లు:
📞 87126 59870
📞 87126 59778