వ్యక్తి అదృశ్యం
27-09-2026 | 07:16pm
ఘట్ కేసర్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ఓ వ్యక్తి అదృష్టమైన సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్(Ghatkesar Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఘట్కేసర్ డివిజన్ బొక్కోనిగూడ గ్రామానికి చెందిన కట్ట సురేందర్ రెడ్డి(46) ఈనెల 26న సాయంత్రం సుమారు 5:00 గంటల సమయంలో తన ప్యాషన్ బైక్ (నంబర్: AP29N4313) పై ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులను ఆరా తీసిన ఫలితం లేకపోవడంతో ఆయన ఆచూకీ లభించలేదు. దీంతో కుమారుడు అజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వ్యక్తి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే వెంటనే ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో లేదా కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్ 8555064188 కు సమాచారం అందించాల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.