రామప్పలో పినాక సినిమా షూటింగ్

10-09-2026 | 06:07pm

వెంకటాపూర్,(విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయం(Ramappa Temple) గురువారం సినిమా షూటింగ్‌ కు వేదికైంది. దర్శకుడు బి ధనుంజయ్(Director B.Dhanunjay) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పినాక’ సినిమా చిత్రీకరణను(Pinaka movie shooting) రామప్ప పరిసర ప్రాంతాల్లో నిర్వహించారు. చారిత్రక కట్టడం, అద్భుతమైన కాకతీయ శిల్పకళ నేపథ్యంలో సినిమా సన్నివేశాలను చిత్రీకరించినట్లు ధనుంజయ్ తెలిపారు.

షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న స్థానికులు, పర్యాటకులు ఆసక్తిగా చిత్రీకరణను వీక్షించారు. రామప్ప ఆలయ పరిసరాలు ఇప్పటికే పలు చిత్రీకరణలకు ఆకర్షణీయమైన ప్రదేశంగా నిలుస్తుండగా, తాజాగా ‘పినాక’ సినిమా షూటింగ్‌తో మరోసారి సందడి నెలకొంది. యూనిట్ సభ్యులు అవసరమైన ఏర్పాట్లు చేసుకుని షూటింగ్ నిర్వహించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప శిల్పకళ, పరిసర ప్రాంతాల అందాలు వెండితెరపై కనిపించనున్న నేపథ్యంలో స్థానికుల్లో ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు