పినపాక పీఆర్‌టీయూ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

27-09-2026 | 07:25pm

పినపాక, సెప్టెంబర్ 27,(విజయ క్రాంతి ): పినపాక మండల పీఆర్‌టీయూ(PRTU) నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. పినపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో(Pinapaka Zilla Parishad High School) నిర్వహించిన ఎన్నికల కార్యక్రమానికి మణుగూరు మండల(Manuguru Mandal) పీఆర్‌టీయూ అధ్యక్షులు వి.వి. కోటేశ్వరరావు ఎన్నికల అధికారిగా(Election Officer) వ్యవహరించారు.మండల అధ్యక్షులుగా వేర్పుల రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా కె. శ్రీకాంత్ ఎన్నికయ్యారు.

అసోసియేట్ అధ్యక్షులుగా బి. దేవేందర్, బి. వీరన్న, కె.వి. రత్నశ్రీ, ఉపాధ్యక్షులుగా యం. మోతీలాల్, బి. వినయ్, ఎస్. షాలిని, ఎస్.కె. షబ్బీర్ అలీ, కార్యదర్శులుగా జి. పవన్, కె. నాగరాజు, యల్. సంతోష్, పి. ఇందు, వి. వివేకా ఎన్నికయ్యారు.అనంతరం జిల్లా అసోసియేట్ అధ్యక్షులు బి. భాస్కర్ నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి. నరసయ్య, ప్రధాన కార్యదర్శి జె. ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి టి. మోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. రామిరెడ్డి తదితరులు పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. పలువురు ఉపాధ్యాయులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు