ప్రభుత్వ కార్యాలయాలలో ప్రధాని మోడీ చిత్రపటాని ఏర్పాటు చేయాలి
నాగిరెడ్డిపేట(విజయక్రాంతి): నాగిరెడ్డిపేట్ తాసిల్దార్ కార్యాలయంలో(Nagireddypet Tahsildar Office) ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఎంపిడిఓ గంగాధర్‌కు బీజేపీ(BJP) మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) చిత్రపటాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరడం జరిగింది. అనంతరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు నాగిరెడ్డిపేట మండలం(Nagireddypet Mandal)లోని వివిధ ప్రభుత్వ ఆఫీసులలో, అన్ని గ్రామ పంచాయతీలలో ప్రధానమంత్రి చిత్రపటం లేకపోవడం భారత ప్రధాని నరేంద్ర మోదీని అవమానించడమే అని భారతీయ జనతా పార్టీ భావిస్తుందని పేర్కొన్నారు. ఇకనైనా అన్ని ప్రభుత్వ కార్యాలయలలో, గ్రామపంచాయతీ కార్యాలయాలలో తక్షణమే భారత ప్రధాని చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు హనుమాన్లు,బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజగౌడ్,నాయకులు విష్ణువర్ధన్,రాజు అంజయ్య,మల్లేష్ భార్గవ్,సిద్దిరములు గోపాల్,పవన్,మణికంఠ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
