కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవ మహా బైక్ ర్యాలీ
07-09-2026 | 04:08pm
- ఘట్ కేసర్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజాపాలన వెయ్యి రోజులు(Thousand Days) పూర్తి చేసుకున్న సందర్భంగా పోచారం డివిజన్ పరిధిలోని నారపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రె రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా బైక్ ర్యాలీ(Bike rallyని ముఖ్య అతిథులు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. )
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని పోచారం డివిజన్ లోని అన్ని ప్రాంతాలలో బైక్ ర్యాలీగా పర్యటించి విజయవంతం చేశారు. ఈకార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలకు డివిజన్ అధ్యక్షులు కర్రె రాజేష్ కృతజ్ఞతలు తెలియజేశారు.
