బిఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమ అరెస్టులకు నిరసన
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం
మాజీ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య.
తుంగతుర్తి (విజయ క్రాంతి): తుంగతుర్తి (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు నెరవేర్చాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన కార్యక్రమాల్లో పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం అమానుషమని మాజీ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంతో పాటు నాగారం, తిరుమలగిరి, మద్దిరాల మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు మెయిన్ రోడ్డుపై నిరసన తెలిపారు.
ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ, ప్రజావాణిలో వినతిపత్రం అందజేసి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 4,260 హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, దీంతో సామాన్య ప్రజలు, రైతులు కష్టాలు చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, తునికి సాయిల్ గౌడ్, మట్టిపెల్లి శ్రీశైలం, చింతకుంట్ల మనోజ్, సాయి, వెంకన్న గౌడ్, తదితర నాయకులు పాల్గొన్నారు.
