మున్నూరు కాపు మండల అధ్యక్షుడిగా పోగుల మల్లేష్
27-09-2026 | 07:57pm
తరిగొప్పుల, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): తరిగొప్పుల మండల(Tarigoppula Mandal) మున్నూరు కాపు సంఘం(Munnuru Kapu Association) నూతన అధ్యక్షుడిగా పోగుల మల్లేష్(Pogula Mallesh) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడు నల్లగొండ మహేందర్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఉపాధ్యక్షుడిగా అమిరిశెట్టి వెంకటరాజయ్య, ప్రధాన కార్యదర్శిగా ఆకుల శ్రీనివాస్, కోశాధికారిగా కలవ రాజు ఎన్నికయ్యారు. మండలంలో సంఘాన్ని బలోపేతం చేసి కుల బంధువుల అభివృద్ధికి కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు పోగుల మల్లేష్ తెలిపారు.