మంచిర్యాలలో విస్తృతంగా గంజాయి తనిఖీలు
19-09-2026 | 01:17pm
మంచిర్యాల క్రైమ్, ( విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలో గంజాయి అక్రమ రవాణా(Cannabis smuggling), వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, అనుమానాస్పద ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేస్తూ గంజాయి రవాణాపై నిఘా పెంచారు. అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేసి వివరాలను పరిశీలించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయాలు లేదా రవాణాపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.