డైట్ పేరుతో డేంజర్ గేమ్?
శేరిలింగంపల్లి, అక్టోబర్ 1 (విజయక్రాంతి): టైప్-1 డయాబెటిస్ (Type-1 Diabetes) బాధితుడిని ఇన్సులిన్ (Insulin) వినియోగం నిలిపివేయాలని సూచించారన్న ఆరోపణలపై రాయదుర్గం పోలీసులు వీఆర్కే హెల్త్‌కేర్ సెంటర్‌పై కేసు నమోదు చేశారు. కల్లెడ సాయికృష్ణ (30) ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టారు.డైట్‌తో (Diet) మధుమేహం తగ్గుతుందని చెప్పి ఇన్సులిన్ తీసుకోవడం ఆపించారని, అనంతరం ఆరోగ్యం విషమించి డయాబెటిక్ కెటోయాసిడోసిస్ (Diabetic Ketoacidosis–DKA)కు గురై కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వచ్చిందని సాయికృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదుపై డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు (Investigation) చేస్తున్నారు. సెంటర్ నిర్వాహకుల అర్హతలు, అనుమతులు, బాధితుడికి ఇచ్చిన వైద్య సూచనలు (Medical Advice), సప్లిమెంట్ల (Supplements) వివరాలను సేకరిస్తున్నారు.బాధితుడి వైద్య రికార్డులను (Medical Records) నిపుణులతో పరిశీలింపజేసి, ఇన్సులిన్ నిలిపివేయడం వల్లే ఆరోగ్య పరిస్థితి విషమించిందా అనే అంశాన్ని నిర్ధారించనున్నట్లు పోలీసులు తెలిపారు.