ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన
మంత్రి పొన్నం ప్రభాకర్
రాజన్నసిరిసిల్ల, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ పాలన కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్పష్టం చేశారు. ప్రజారంజక పాలన సాగిస్తూ, అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో ప్రభుత్వం ముందుకెళ్లుందన్నారు.
ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు, సిరిసిల్ల భవిష్యత్తు అభివృద్ధికి అవసరమైన చర్యలను ముందుకు తీసుకెళ్లేందుకు సభ ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని స్పష్టం చేశారు. వ్యవసాయం, విద్య, వైద్యం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఉద్ఘాటించారు.
గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల రాష్ర్టంగా మార్చిందని, స్వరాష్ట్ర ఆకాంక్షలను మరిచి నిరంకుశంగా వ్యవహరించిందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే అనేక పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. నేతన్నల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. సభకు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేసిన ప్రజలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.