ముగ్గురికి పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారాలు
కోదండరెడ్డి, కొండలరావు, కనకవ్వ లకు
పొన్నం సత్తయ్య జీవిత సాపల్య పురస్కారం
కొత్తపల్లి, సెప్టెంబర్06(విజయాక్రాంతి): రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తండ్రి పొన్నం సత్తయ్య(Ponnam Sattayya) ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ప్రతి ఏటా అందిస్తున్న పొన్నం సత్తయ్య జీవిత సాపల్య పురస్కారాలకు ఈ ఏడాదికి గాను వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ ఎం. కోదండరెడ్డి, సాహిత్య విభాగంలో వెలిచాల కొండలరావు, కళారంగంలో గొట్టే కనకవ్వ లు ఎంపికయ్యారు. ఈ అవార్డుల జ్యూరీ కమిటీ కన్వీనర్ డా. పొన్నం రవిచంద్ర సారధ్యంలో కమిటి ఎంపిక చేసింది.
గత నాలుగు సంవత్సరాలుగా ఈ అవార్డులను సాహిత్య విభాగంలో నాలేశ్వరం శంకరం, నలిమెల భాస్కర్, చంద్ర బోస్, అంపశయ్య నవీన్ లకు, కళారంగంలో ఒగ్గు ధర్మయ్య, కామ్రేడ్ విమలక్క, బలగం కొమురమ్మ, అంతడుపుల రమాదేవి లకు ఇవ్వడం జరిగింది. వ్యవసాయ రంగంలో ఈ ఏడాది తొలిసారి ఈ అవార్డును ప్రవేశ పెట్టడం జరిగింది.
పొన్నం సత్తయ్య 16 వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 13 వ తేదీన రవీంద్రభారతి లో మద్యాహనం 2,00 గంటలకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జీవిత సాపల్య పురస్కారాలకు ఎంపిక చేసిన వీరికి 50 వేల నగదు తో పాటు మేమంటొ, ప్రశంస పత్రం అందచేయడం జరుగుతుందని ట్రస్టు ఉపాధ్యక్షులు పొన్నం అశోక్ గౌడ్ తెలిపారు






