చలో ఉట్నూర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
ఆదివాసి గూడెంలో ప్రచారం
ఇంద్రవెల్లి మండలంలో పోస్టర్ల ఆవిష్కరణ
ఉట్నూర్, సెప్టెంబర్ 09( విజయక్రాంతి): ఆదివాసీ గిరిజనుల హక్కుల సాధన(Achieving tribal rights) కోసం ఈనెల 16వ తేదీన చలో ఉట్నూర్ కార్యక్రమాన్ని(Chalo Utnur Program) విజయవంతం చేసేందుకు ఆదివాసి లు తరలిరావాలని ఆదివాసి గ్రామాల్లో తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ప్రచారం ముమ్మరం చేశారు. మంగళవారం రాత్రి, బుధవారం రోజున ఇంద్రవెల్లి మండలం(Indravelli Mandal)లోని దొండందా, గట్టెపల్లి గ్రామాల్లో బుధవారం ఆదివాసీ మార్చ్ కార్యక్రమం(Adivasi march program)లో భాగంగా “హాలో ఆదివాసీ – చలో ITDA ఉట్నూర్” గోడపత్రికలను తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకులు ఆవిష్కరించారు.
దొడందా, గట్టెపల్లి గ్రామలలో నిర్వహించిన పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క చిత్రు, ASU మండల అధ్యక్షులు గేడం లాలు ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఆదివాసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కుల పరిరక్షణతో పాటు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ITDA కేంద్రాల వద్ద ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టామని గిరిజనులకు వివరించారు. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలని ముఖ్య డిమాండ్లు ఉన్నాయని వారికి వివరించారు.